Cancer: కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే థెరపీ
Sakshi Education
శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు, కణజాలాల జోలికి పోకుండా.. కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే కొత్త విధానాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. నేచురల్ కిల్లర్(ఎన్‌కే) వంటి రోగ నిరోధక కణాలతో తయారైన యాంటీట్యూమర్ రోగ నిరోధక ప్రతిస్పందనను ఈ చికిత్స ద్వారా క్రియాశీలకంగా మార్చవచ్చు. అంకోలైటిక్ వైరోథెరపీ(ఓవీ) అనే ఈ విధానం ఇటీవల వచ్చిన కేన్సర్ చికిత్సల్లో అత్యంత నమ్మకమైనదిగా భావిస్తున్నారు. హూస్టన్లోని సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ డైరెక్టర్ షౌన్ ఝాంగ్ దీన్ని అభివృద్ధి చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 03:27PM