Thailand Passes Bill: కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన థాయిలాండ్
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. థాయిలాండ్‌లో అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురిచేసే బిల్లుకు.. ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం–సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదంతోపాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గించే ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారు. ‘హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు’ను న్యాయశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ కూడా ఆమోద ముద్ర వేసింది.
చదవండి: Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP