Cancer: చెంచాడు రక్తంతో క్యాన్సర్‌పై లోతైన పరిశోధన
చెంచాడు రక్తాన్ని విశ్లేషించడం ద్వారా.. ఒక వ్యక్తిలో క్యాన్సర్ పోకడల గురించి లోతైన వివరాలను రాబట్టే ప్రక్రియను కెనడా, బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రోగికి అనువైన చికిత్సను గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుంది. శరీరంలో ఇతర అవయవాలకు వ్యాప్తి చెందే క్యాన్సర్లను మెటాస్టాటిక్ క్యాన్సర్లుగా పేర్కొంటారు. కీమోథెరపీ, కొత్తగా వచ్చిన లక్షిత చికిత్సలు.. ఈ తరహా రోగులందరికీ సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అలాంటివారికి ప్రయోజనం కలిగించే చికిత్సలను గుర్తించేందుకు బయాప్సీలు నిర్వహించాలి. ఇందుకోసం శరీరానికి కోత పెట్టాలి. దీనికితోడు దుష్ప్రభావాల ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటివారి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి, చికిత్స చేయడానికి ఇదే పెద్ద అవరోధం. మెటాస్టాటిక్ క్యాన్సర్లు రోగి రక్త ప్రవాహంలోకి డీఎన్ ఏను విడుదల చేస్తాయి. వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ ఏ(సీటీడీఎన్ ఏ)గా పిలుస్తారు. తాజాగా శాస్త్రవేత్తలు వీటిని లక్ష్యంగా చేసుకున్నారు. రోగుల నుంచి చెంచాడు రక్తాన్ని సేకరించి, అందులో నుంచి సీటీడీఎన్‌ఏను వేరుచేశారు. దాని జన్యుక్రమాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP