Sri Lanka - China: శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా వెల్లడించింది. టోక్ మకాక్ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ.. శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులను ఆదేశించారు. ‘టోక్‌మకాక్’ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా. ఇవి స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని, ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వాటిని ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని ఉచితంగా ఇస్తారా.. లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా..అన్న విషయంపై స్పష్టత లేదు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP