South Korea: జాబిల్లి కక్ష్యలోకి దక్షిణ కొరియా తొలి వ్యోమనౌక
Sakshi Education
దక్షిణ కొరియా చంద్రుడి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్‌ను పంపింది. భవిష్యత్‌లో జాబిల్లి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది గుర్తిస్తుంది.'దనురి' అనే ఈ ఆర్బిటర్‌ను స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్‌కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. ఇది డిసెంబరులో జాబిల్లిని చేరుతుంది. 18 కోట్ల డాలర్లతో దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దనురి చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. ఏడాది పాటు చందమామను శోధిస్తుంది. ప్రస్తుతం చంద్రుడిని భారత్, అమెరికా, చైనాల వ్యోమనౌకలు శోధిస్తున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 26 Aug 2022 04:54PM