Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశం?
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌కు టీ–72 యుద్ధ ట్యాంకులు, బీవీపీ–1 సాయుధ వాహనాలు పంపుతూ చెక్ రిపబ్లిక్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశంగా నిలిచింది. మిగతా దేశాలన్నీ ఇప్పటిదాకా యాంటీ ట్యాంక్ మిసైళ్లు, చిన్న ఆయుధాలు, పరికరాలు ఇస్తూ వచ్చాయి.
Political Crisis in Pakistan: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
పుతిన్ కూతుళ్లపై ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతుళ్లు మరియా పుతినా, క్యాథరినా తికొనోవాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. త్వరలో మరిన్ని ఆంక్షలుంటాయంటూ అధ్యక్షుడు బైడెన్ ట్వీట్ చేశారు. పుతిన్ కూతుళ్ల వివరాలను రష్యా అత్యంత గోప్యంగా ఉంచుతూ వస్తోంది. మరియా ఓ ప్రైవేట్ కంపెనీలో, క్యాథెరినా మాస్కో స్టేట్ వర్సిటీలో పని చేస్తున్నట్టు సమాచారం.
బుచా హత్యాకాండ దారుణం
ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యాకాండను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది చాలా గంభీరమైన విషయం. దీనిపై స్వతంత్ర విచారణ జరగాల్సిందే’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పరిస్థితిపై లోక్‌సభలో జరిగిన చర్చకు ఏప్రిల్ 6న మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.
United Nations: ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన నేత?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్