Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. మొదలైన యుద్ధం..
Sakshi Education
Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై ఇప్పటికే రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది.
- ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. దీంతో డోన్సాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీచేశారు. డొనెట్స్‌క్, లుహాన్స్‌క్ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరించింది.
- రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ఉక్రెయిన్ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్ యోచిస్తుంది. దీనికి ఆ దేశ పార్లమెంటు అమోదం తెలుపాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రష్యా సైనిక చర్య నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి విజ్ఙప్తి చేసింది.
- దక్షిణ బెలారస్‌లో ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్ సంస్థ సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దక్షిణ బెలారస్‌లోని మెజ్యార్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద 100కుపైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్‌కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్‌బాస్‌లోకి రష్యా సేనలు చేరుకున్నాయి.
- ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్‌ను అమెరికా, మిత్ర దేశాలు విస్మరించాయని పేర్కొన్నారు.
Published date : 24 Feb 2022 10:16AM