Skip to main content

Kate Middleton: ప్రజల ముందుకు వచ్చిన బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్

క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్‌ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్‌ మిడిల్టన్‌ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు.
British royal family attending Trooping the Colour parade in London  Princess Kate Middleton making a public appearance after cancer treatment

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌–3 జన్మదినోత్సవాల్లో భాగంగా లండన్‌లో జూన్ 15వ తేదీ అధికారికంగా సైనిక పరేడ్‌ నిర్వహించారు. ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 

గత ఏడాది డిసెంబర్‌ తర్వాత కేట్‌ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్‌ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్‌ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది.

 

Published date : 19 Jun 2024 09:36AM

Photo Stories