Skip to main content

Shehbaz Sharif: యుద్ధాలతో గుణపాఠాలు నేర్చుకున్నాం.. పాక్‌ ప్రధాని షహబాజ్‌

భారత్‌తో మూడు యుద్ధాల అనంతరం గుణపాఠాలు నేర్చుకున్నామని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు.

‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించిందేమీ లేదు. పైగా పేదరికం, వేదన, నిరుద్యోగం వచ్చి మీదపడ్డాయి. యుద్ధాలతో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఇకమీదటైనా శాంతిమయ జీవనం కొనసాగిస్తాం. తరాలుగా కొనసాగుతున్న సమస్యలకు చెక్‌ పెడదాం. బాంబులు, మందుగుండు సామగ్రి కోసం అమూల్యమైన సహజ వనరులను దుర్వినియోగం చేయడం ఆపేద్దాం. దశాబ్దాలుగా ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన కశ్మీర్‌ వంటి కీలకాంశాలపై భారత్‌తో నిజాయతీతో చర్చలకు సిద్దం’’ అని అల్‌ అరేబియా ఛానెల్‌ ఇంటర్‌వ్యూలో అన్నారు. యూఏఈ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిపితే బాగుంటుందన్నారు. ‘ప్రధాని మోదీజీకి నా సందేశం ఒక్కటే. పాకిస్తాన్, ఇండియా పొరుగుదేశాలుగా జీవించాల్సిందే. సంఘర్షణల మధ్య సమయాన్ని, సహజ వనరులను వృధా చేయడం దండగ. శాంతి సామరస్యాలతో పురోగమిద్దాం’ అన్నారు. 

Food Crisis: పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం.. మార్కెట్లలో తొక్కిసలాటలు

 

Published date : 18 Jan 2023 12:57PM

Photo Stories