Taliban Suicide Attac: మసీదులో తాలిబన్ ఆత్మాహుతి దాడి.. 61 మంది దుర్మరణం
![](/sites/default/files/images/2023/01/31/taliban-suicide-attac-1675152312.jpg)
గాయపడిన వారిలో పోలీసులు, భద్రత, ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. దాడి జరిగిన మసీదు నగరంలోని పోలీస్ లైన్స్ ప్రాంత పోలీస్ ఆఫీస్ సమీపంలో ఉంది. దాంతో ఈ మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల్లో ఎక్కువ మంది పోలీసు, ఆర్మీ, బాంబ్ నిర్వీర్య దళాల సభ్యులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో గత ఏడాది ఆగస్టులో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) కమాండర్ ఉమర్ ఖలీద్ ఖురసానీని చంపినందుకు ప్రతీకారంగా పెషావర్ పేలుడు జరిపామని ఖలీద్ సోదరుడు ప్రకటించారు. పేలుడు ధాటికి మసీదు కొంత నేలకూలింది. ఈ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఎస్పీ ఆఫీస్ పక్కనే ఉన్న ఈ మసీదుకు భద్రత ఎక్కువ. మసీదులో నాలుగు అంచెల భద్రత వలయం దాటుకుని మరీ ఆత్మాహుతి బాంబర్ లోపలికొచ్చి దాడి చేయడం గమనార్హం. దాడి సమయానికి ఆ మసీదు లోపల, బయట కలిపి మొత్తంగా 300–400 మంది పోలీసులు ఉండొచ్చని పెషావర్ సిటీ పోలీస్ ఆఫీసర్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ చెప్పారు. దాడి ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు.