United Nations:మాకు ఆ భ్రమలు లేవు.. రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలపై ఐరాస
Sakshi Education
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాల్లేవని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు.
![](/sites/default/files/images/2022/12/21/antonio-guterres-1671604888.jpg)
శాంతి చర్చలు జరిగి, యుద్ధం ఆగుతుందన్న భ్రమలు లేవన్నారు. చర్చల ద్వారా నల్ల సముద్రం గుండా ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతుల వంటివాటిపై దృష్టి పెట్టామన్నారు. 2023లో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
Published date : 21 Dec 2022 12:11PM