Skip to main content

North Korea Military Parade: అణు క్షిపణులతో ఉత్తరకొరియా పరేడ్‌

ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ వీటిని తిలకించారు.
North-Korea-Military-Parade
North Korea Military Parade

1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్‌ పరేడ్‌ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

☛☛ Israel’s judicial reforms bill: న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం

ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్‌ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్‌–2 సంగ్‌ స్క్వేర్‌లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రతినిధి లి హొంగ్‌జోంగ్‌లతో కలిసి ప్రదర్శనను కిమ్‌ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్‌ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్‌ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు.

☛☛ Daily Current Affairs in Telugu: 29 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

 

Published date : 31 Jul 2023 12:59PM

Photo Stories