Lula da Silva: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో డ సిల్వా జయకేతనం
Sakshi Education
- 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధికార పగ్గాలు
Lula da Silva will return to Brazil's presidency
సావ్ పావ్లో: ఉత్కంఠభరితంగా జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత, మాజీ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూనా డ సిల్వా (77)ను స్వల్ప ఆధిక్యంతో విజయం వరించింది. అధ్యక్షుడు బోల్సోనారోను ఓడించి 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 1985 తర్వాత ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన బ్రెజిల్‌లో అధికార పీఠంపై కూర్చున్న వ్యక్తి తదుపరి ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి! సిల్వాను అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభినందించారు.