Israel Parliament Dissolved: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు
Sakshi Education
భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. దానిని విజయవంతంగా నడపడంలో మాత్రం ఇజ్రాయెల్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం తెలపడంతోపాటు నవంబర్‌లో మరోసారి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. గత నాలుగేళ్లలో ఇలా ఎన్నికలు జరపడం ఐదోసారి కావడం గమనార్హం. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్.. స్వల్ప వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం విదేశాంగమంత్రిగా ఉన్న యాయెర్ లాపిడ్ ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 06:36PM