India Population to Surpass China: జనాభాలో చైనాను మించిపోనున్న భారత్
ఈ ఏడాది నవంబరు 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వచ్చే ఏడాది జన సంఖ్యలో చైనాను భారత దేశం దాటిపోతుందని ప్రకటించింది. ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖకు చెందిన జనాభా వ్యవహారాల విభాగం విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. 2020 నుంచి ప్రపంచ జనాభా వృద్ధిరేటు 1 శాతం కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ.. 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లకూ.. 2030లో 850 కోట్లకూ.. 2050లో 970 కోట్లకు చేరనున్నది. 2080 కల్లా భూగోళంపై జనాభా 1040 కోట్లకు పెరిగి 2100 నాటికీ కూడా అదే స్థాయిలో స్థిరంగా ఉంటుందని యూఎన్ అంచనా వేసింది. ప్రపంచం జనాభాలో త్వరలో ఓ మైలురాయిని దాటనుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP