India-Vietnam Relations: కీలక ఒప్పందాలపై భారత్, వియత్నాం సంతకాలు
కీలకమైన రవాణా సహకారంపై భారత్, వియత్నాం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి. తొలిసారి భారత్‌తో వియత్నాం కుదుర్చుకొన్న కీలక ఒప్పందం ఇదే కావడం విశేషం.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వియాత్నాంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2030 నాటికి ఇండియా–వియత్నాం ఉమ్మడి రక్షణ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్, వియత్నాంల మధ్య సహకారానికి సంబంధించిన అవసరాలను, అవకాశాలను ఈ ప్రకటనలో ప్రస్తావించారు. దీంతోపాటు భారత్.. వియత్నాంకు అందజేయనున్న 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఓ కొలిక్కి తెచ్చే అంశంపై కూడా చర్చ జరిగింది. వియత్నాం ఎయిర్‌ఫోర్స్‌కు శిక్షణ కోసం రెండు సిమ్యూలేటర్లు అందజేయడంతోపాటు లాంగ్వేజ్, ఐటీ ల్యాబ్‌లను భారత్ ఏర్పాటు చేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్