Indo Pacific Economic Framework: 12 దేశాల భాగస్వామ్యంతో ఐపీఈఎఫ్
Telugu Current Affairs - International: కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి.. ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతోపాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్(ఐపీఈఎఫ్) పేరుతో సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పీ¯న్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్ దోహదపడుతుందంటూ.. ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్‌వీలు కల్పిస్తుంది.