Skip to main content

IMEC project: ‘ఐమెక్‌’ ప్రాజెక్ట్‌

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్‌’ ప్రాజెక్ట్‌ గురించి ప్రస్తావించారు.
IMEC project

రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ ప్రపంచ వాణిజ్యానికి ఆధా­రం కానుందని, భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచానికే ఇది గేమ్‌ చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నా­రు. భారత్‌ గడ్డపై ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చరిత్రలో ఓ మైలురాయిగా గుర్తుండిపోతుందని కూడా ఆమె తన ప్రసంగంలో వ్యాఖ్యానించా­రు. ఐమెక్‌ ప్రాజెక్ట్‌ అంటే మిడిల్‌ ఈస్ట్‌ ద్వారా భారతదేశాన్ని యూరప్‌తో అనుసంధానించే ఒక మెగా ప్రాజెక్ట్‌. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించింది. ఆ సదస్సులో భారత్, యూఏఈ, సౌదీ, ఫ్రాన్స్‌, జర్మనీ, యూరోపియన్‌ యూనియన్, ఇటలీ దేశాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు.. మళ్లీ అక్కడి నుంచి ఇజ్రాయెల్‌ మీదుగా ఐరోపాలోకి సరుకులను రవాణా చేసేందుకు వీలుగా ఈ ఐమెక్‌ ప్రాజెక్ట్‌ను ప్లాన్‌ చేశారు.సెప్టెంబరు 9న ఎంఓయూ కుదరగా.. ఆ సమయంలోనే దీన్ని ఒక చారిత్రాత్మక ఒప్పందంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

చదవండి: World Economy: ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన

Published date : 05 Feb 2024 06:23PM

Photo Stories