Skip to main content

మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ

బెర్లిన్‌: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ గణాంకాలు పేర్కొన్నాయి.
germanygdp
germanygdp

2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది.

వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

Published date : 26 May 2023 02:55PM

Photo Stories