Covid: మహమ్మారిపై పోరుకు ప్రత్యేక నిధి
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ‘మహమ్మారి నిధి’ని ప్రకటించారు. తదుపరి మహమ్మారిని నిరోధించేందుకు, దాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని జీ–20 నిర్ణయించింది. కూటమి సభ్యదేశాలతోపాటు ఇతర దేశాలు, దాతృత్వ సంస్థలూ ఆర్థిక సహకారం అందించాయి. కానీ 1.4 బిలియన్ డాలర్లు సరిపోవు. కనీసం 31 బిలియన్‌డాలర్లు అవసరం’ అని విడోడో పేర్కొన్నారు. ‘పాండమిక్‌ఫండ్’.. ఆరోగ్య సంక్షోభాలను మెరుగ్గా ఎదుర్కొనేందుకు.. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు తోడ్పడే ఒక ముఖ్యమైన సాధనమని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తెలిపారు. ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఇందులో ఇప్పటి వరకు 24 దేశాలు చేరాయి. ఈ ఫండ్‌కు దాదాపు మూడోవంతు నిధులు(450 మిలియన్‌డాలర్లు) అమెరికా సమకూర్చింది. బ్రిటన్, భారత్, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఇతర ప్రధాన దాతలుగా ఉన్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP