Ukraine Crisis: ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై చర్చలు ప్రారంభించిన దేశాలు?
ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఫిబ్రవరి 7న అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో పుతిన్‌తో మాక్రాన్ సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్.. ఫిబ్రవరి 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు.
అప్పట్లో కూడా ఆ రెండే..
క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది.
అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్ దాడులు చేస్తోన్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్, రష్యా, అమెరికాతో చర్చలు ప్రారంభించిన దేశాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఫ్రాన్స్, జర్మనీ
ఎందుకు : ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్