Earthquake: తజకిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం..
Sakshi Education
తూర్పు తజకిస్తాన్‌లో ఫిబ్రవరి 23వ తేదీ (గురువారం) రిక్టార్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దుల్లోని గోర్నో-బదక్షన్‌లో భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.37 గంటలకు, భూ ఉపరితం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వచ్చిన మరో 20 నిమిషాల తరువాత 5.0 తీవ్రతో మరో భూకంపం వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉన్న పామిర్ పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడం వల్ల పెద్దగా నష్టం కలగలేదు.
Published date : 23 Feb 2023 11:29AM