BJP: ప్రపంచంలో అత్యంత కీలకమైన పార్టీ బీజేపీ
వాల్టర్ రసెల్ మెడ్ రాసిన ఈ వ్యాసంలో భారత్‌లో అధికార బీజేపీ అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణంలో గమనిస్తే అత్యంత ముఖ్యమైన పార్టీగా అభివర్ణించారు. ఇంకా అందులో ఏం రాశారంటే..‘‘2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన బీజేపీ 2024లో మరోసారి విజయాన్ని దక్కించుకోవడం ఖాయం. జపాన్‌తో సమానమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోంది.
శక్తిమంతమైన చైనాతో సమతుల్యత సాధించడానికి అమెరికా కృషి చేస్తూ ఉంటే, ఎవరి సాయం లేకుండా బీజేపీ తాను కోరుకున్న భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటోంది. బీజేపీ శక్తి ఏమిటో ప్రపంచ దేశాలు చాలా తక్కువగా అర్థం చేసుకున్నాయి. ఎందుకంటే ఆ పార్టీకున్న చరిత్ర, సంస్కృతి భారతీయులు కానివారికి అంతగా తెలీదు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మాదిరిగానే వంద కోట్లకు పైగా జనాభాని పాలించి గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదగాలన్నదే బీజేపీ ధ్యేయం’’ అంటూ ఆ వ్యాసం సాగింది.