Skip to main content

Brand Finance: ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?

TCS and Accenture

అంతర్జాతీయంగా ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) అవతరించింది. అలాగే టాప్‌–25 కంపెనీల్లో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ)కు చోటు దక్కింది. జనవరి 26న బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 36.2 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో యాక్సెంచర్‌ మొదటి స్థానాన్ని కాపాడుకుంది.
  • ఐబీఎం నాలుగో స్థానానికి పడిపోయింది.   
  • వార్షికంగా టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 12 శాతం పెరిగింది. 2020 నుంచి చూస్తే 24 శాతం వృద్ధితో 16.8 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 
  • టీసీఎస్‌ మొదటిసారి 25 బిలియన్‌ డాలర్ల ఆదాయ స్థాయికి చేరకుంది.
  • ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో ఉంటే, విప్రో 7వ స్థానం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 8, టెక్‌ మహీంద్రా 15, ఎల్‌టీఐ 22వ స్థానాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ గత ఏడాది కాలంలో 52 శాతం పెరగ్గా, 2020 నుంచి 80 శాతం పెరిగి 12.8 బిలియన్‌ డాలర్లకు చేరింది.
  • విప్రో బ్రాండ్‌ విలువ 6.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 48 శాతం పెరిగింది.
  • హెచ్‌సీఎల్‌ టెక్‌ బ్రాండ్‌ విలువ 10 శాతం వృద్ధితో 6.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది.
  • టెక్‌ మహీంద్రా బ్రాండ్‌ విలువ గడిచిన రెండేళ్లలో 45 శాతం వృద్ధితో 3 బిలియన్‌ డాలర్లకు చేరింది.
  • భారత ఐటీ బ్రాండ్లు 2020–22 మధ్య 51 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ అంచనా.

చ‌ద‌వండి: ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?
ఎప్పుడు  : జనవరి 26
ఎవరు    : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)
ఎక్కడ    : ప్రపంచంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Jan 2022 03:51PM

Photo Stories