Skip to main content

Reserve Bank of India: ఆర్‌బీఐ అక్షరాస్యతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించనున్నారు?

RBI

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్‌ రంగం పట్ల అవగాహన కల్పిస్తూ,  దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ‘గో డిజిటల్, గో సెక్యూర్‌’ అన్న ప్రధాన థీమ్‌తో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల ప్రాతపై విస్తృత ప్రచారం జరగనుంది. 2016 నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షికంగా ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020–25 ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ జాతీయ వ్యూహంలో ‘గో డిజిటల్, గో సెక్యూర్‌’ అనే థీమ్‌ ఒకటని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

డాక్టర్‌ రెడ్డీస్‌తో నోవార్టిస్‌ జోడీ

ఔషధ తయారీలో ఉన్న నోవార్టిస్‌ ఇండియా తాజాగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నోవార్టిస్‌ తయారీ వావెరాన్, మెథర్జీన్‌తోపాటు క్యాల్షియం తదితర ఔషధాలను రెడ్డీస్‌ భారత్‌లో అమ్మకాలు, పంపిణీ చేపట్టనుంది. నోవార్టిస్‌ సంస్థ.. దేశంలో పరిశోధన, అభివృద్ధి మద్దతు కేంద్రం, సేవల కోసం అయిదేళ్లలో రూ.2,220 కోట్లు వెచ్చించింది. మేఘాలయలో రూ.360 కోట్లతో కొత్త ప్లాంటును స్థాపిస్తోంది.

చ‌ద‌వండి: ఈ–రూపీ గరిష్ట పరిమితిని ఎన్ని రూపాయలకు పెంచారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాల నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ..
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
ఎక్కడ    : దేశవ్యాప్తంగా..
ఎందుకు : ఫైనాన్షియల్‌ రంగం పట్ల అవగాహన కల్పించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Feb 2022 02:37PM

Photo Stories