SWREL: స్టెర్లింగ్ విల్సన్ కొత్త ప్రమోటర్‌గా ఆవిర్భవించిన సంస్థ?
స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్(ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్) కొత్త ప్రమోటర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఆవిర్భవించింది. అనుబంధ సంస్థలతో కలసి ఆర్‌ఐఎల్ 40 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు వీలుగా రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్) 25.9 శాతం ఈక్విటీ వాటా కొనుగోలుకి మిగిలిన రూ. 1,583 కోట్లు చెల్లించింది. ఈ లావాదేవీ తదుపరి రిలయన్స్ గ్రూప్ సంస్థలు ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్‌లో ఉమ్మడిగా 40 శాతం వాటాను పొందాయి.
దేశంలో మొదటి ఆటోఈటీఎఫ్ పథకాన్ని ప్రారంభించిన సంస్థ?
దేశంలో మొదటి ఆటోఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) ప్రారంభించింది. ఈ పథకం 2022, జనవరి 5న మొదలై, 10వ తేదీన ముగుస్తుందని సంస్థ ప్రకటించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఇండెక్స్‌లో భాగంగా ఉన్న బ్లూచిప్ ఆటోమొబైల్, ఆటో యాన్సిలరీ (విడిభాగాల తయారీ సంస్థలు) కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని తెలిపింది.
చదవండి: 2021–22 ఏడాదిలో భారత్ ఎగుమతుల లక్ష్యం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్(ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్) కొత్త ప్రమోటర్‌గా ఆవిర్భవించిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)
ఎందుకు : అనుబంధ సంస్థలతో కలసి ఆర్‌ఐఎల్ 40 శాతం వాటాను సొంత చేసుకున్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్