Skip to main content

నవంబర్ 2018 ఎకానమీ

యూపీఏ హయాంలోని వృద్ధి రేటు సవరణ
Current 
Affairs కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 28న సవరించింది. ఈ మేరకు ‘సవరిత’ తాజా లెక్కలను కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసింది. మైనింగ్, క్వారీయింగ్, టెలికం సహా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాల్లో గణాంకాల తాజా మదింపు వల్లే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సవరించిన వృద్ధి గణాంకాల ప్రకారం...

ఆర్థిక సంవత్సరం

పాత(శాతాలలో..)

కొత్త(శాతాలలో..)

2005-06

9.3

7.9

2006-07

9.3

8.1

2007-08

9.8

7.7

2008-09

3.9

3.1

2009-10

8.5

7.9

2010-11

10.3

8.5

2011-12

6.6

5.2

క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైన జీడీపీ వృద్ధి రేటు సవరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

ఆలీబాబా సింగిల్స్ డే’ రికార్డు...
Current Affairs చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా నవంబర్ 11న నిర్వహించిన సింగిల్స్ డే సేల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. గతేడాది సింగిల్స్ డే రోజు నమోదైన 25 బిలియన్ డాలర్ల విక్రయాలను కేవలం 16 గంటల్లోనే సాధించి తన రికార్డు తానే తిరగరాసుకుంది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పాలపౌడరు, డైపర్లు మొదలైనవి కూడా అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఉన్నాయి. జంటల కోసం ఉద్దేశించినదైన వేలంటైన్స్ డేకి భిన్నంగా పదకొండో నెల పదకొండో తారీఖుని సింగిల్స్ (ఒంటరి) డేగా చైనా యువత పాటిస్తుంది. దీన్ని పురస్కరించుకుని వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి సింగిల్స్ డే తొలి గంటలోనే ఆలీబాబా సుమారు 10 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అయితే, అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ.. ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫరు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు క్రమంగా సింగిల్స్ డే కోసమే ఎదురుచూడటం తగ్గుతోందని, ఫలితంగా అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలీబాబా సింగిల్స్ ‘డే’ సేల్స్
ఎప్పుడు : నవంబర్ 11న
ఎవరు : ఆలీబాబా
ఎక్కడ : చైనా
Published date : 23 Nov 2018 05:00PM

Photo Stories