WAIPA President: వైపా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన దక్షిణాసియా దేశం?
పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా - WAIPA) ప్రెసిడెంట్గా భారత ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ‘‘ఇన్వెస్ట్ ఇండియా’’ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ విషయాన్ని అక్టోబర్ 22న అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్ కమిటీలో ప్రెసిడెంట్గా ఇన్వెస్ట్ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్.. స్విట్జర్లాండ్ వైస్–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది.
చదవండి: డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఏజెన్సీ ?
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా
ఎందుకు : పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...