Skip to main content

పీఎంజీకేఏవై వల్ల పేదరికం తీవ్రత తగ్గింది: ఐఎంఎఫ్‌

Ration

పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొంది. ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’  అనే అంశంపై ఈ వర్కింగ్‌ పేపర్‌ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్‌ ఎస్‌ భల్లా, కరణ్‌ భాసిన్, అరవింద్‌ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్‌ పేపర్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

  •  2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది. 2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో పీఎంజీకేఏవై కీలకపాత్ర పోషించింది.
  • మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. 2022 సెప్టెంబర్‌ వరకూ ఈ పథకాన్ని పొడిగించారు.
  • 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది.  
  • ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది.  
  • మహమ్మారి సమయంలో భారత్‌ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్‌ఎస్‌ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. 
  • తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి.  
  • దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య  ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల  దాదాపు 50 శాతం మేర సమసిపోయింది.

Stats of India: స్టాక్‌ మదుపరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

India GDP Growth Rate: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2022–23లో భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)వల్ల పేదరికం తీవ్రత తగ్గింది 
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)
ఎక్కడ    : భారత్‌లో..
ఎందుకు : పీఎంజీకేఏవై ద్వారా ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తుండటంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Apr 2022 02:19PM

Photo Stories