Skip to main content

RBI: పిల్లలకు ఇక ఆర్థిక పాఠాలు

న్యూఢిల్లీ: దేశంలో మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆర్‌బీఐ సూచించే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడానికి అంగీకరించాయి.
Financial literacy program 2022
Financial literacy program 2022

ఆర్‌బీఐ, ఇతర నియంత్రణ సంస్థలు సంయుక్తంగా ఆర్థిక అక్షరాస్యత అంశాలను రూపొందించాయి. దీంతో స్కూల్‌ పాఠ్యాంశాల్లో ప్రాథమిక ఆర్థిక అంశాలకు చోటు లభించనుంది. ‘‘పాఠశాల విద్యలో ఆర్థిక అక్షరాస్యతను మనం చేర్చితే, దేశంలో ఆర్థిక జ్ఞానం విస్తరించేందుకు తోడ్పడుతుంది. 6–10 తరగతుల పాఠాల్లో దీన్ని చేర్చనున్నా’’అని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ శర్మ అన్నారు.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App​​​​​​​

Published date : 15 Nov 2022 02:53PM

Photo Stories