Skip to main content

GroupM Report: 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనున్న విభాగం?

GroupM-Digital Media

టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్‌ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ గ్రూప్‌ఎమ్‌ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘''దిస్‌ ఇయర్, నెక్ట్స్‌ ఇయర్‌’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్‌) అంచనాల"  నివేదికను ఫిబ్రవరి 15న ఆవిష్కరించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • యాడ్‌ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
  • మొత్తం మాధ్యమంలో డిజిటల్‌ షేర్‌ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. 
  • ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటనల వ్యయం 11 శాతం పెరిగి 850 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. డిజిటల్‌ వాటా ఇందులో 66 శాతం.
  • సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్‌ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్‌ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్‌ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్‌ చేస్తాయి.

చ‌ద‌వండి: 2022 జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దిస్‌ ఇయర్, నెక్ట్స్‌ ఇయర్‌’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్‌) అంచనాల  నివేదిక విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు    : అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ గ్రూప్‌ఎమ్‌  
ఎందుకు : మీడియా పరిశ్రమకు సంబంధించి చేసిన అధ్యయన వివరాలను వెల్లడించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Feb 2022 02:29PM

Photo Stories