Skip to main content

Manufacturing Plant: బజాజ్‌ ఆటో కొత్త ఈవీ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

Bajaj

ద్విచక్ర వాహన దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఆక్రుడి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పనుంది. ఇందుకు రూ. 300 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వార్షికంగా 5 లక్షల వాహన తయారీ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దేశ, విదేశీ మార్కెట్లలో వాహనాలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల ఈ ప్లాంటు నుంచి తొలి వాహనం 2022 జూన్‌కల్లా వెలువడవచ్చని వివరించింది. కంపెనీ గత సుప్రసిద్ధ బ్రాండ్‌ చేతక్‌ స్కూటర్‌ తయారీ ప్రాంతమిది. 

చౌకైన హౌసింగ్‌ మార్కెట్‌గా అహ్మదాబాద్‌

ఆదాయంలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ప్రాతిపదికన ఎనిమిది ప్రధాన నగరాల్లో అత్యంత చౌకైన హౌసింగ్‌ మార్కెట్‌గా అహ్మదాబాద్‌ నిలిచింది. ఆర్థిక రాజధాని ముంబై ఖరీదైన మార్కెట్‌గా ఉంది. కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ రూపొందించిన అఫోర్డబిలిటీ సూచీ 2021 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్‌లో అఫోర్డబిలిటీ సూచీ అత్యంత కనిష్టంగా 20 శాతంగా ఉండగా, ముంబైలో అత్యధికంగా 53 శాతంగా ఉంది. పుణెలో 24 శాతం, బెంగళూరులో 26 శాతం, చెన్నై..కోల్‌కతా 25 శాతం,  హైదరాబాద్‌ 29 శాతం స్థాయుల్లో ఉన్నాయి. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్‌) అఫోర్డబిలిటీ నిష్పత్తి గణనీయంగా మెరుగుపడింది. 2020లో 38 శాతంగా ఉండగా..2021లో 28 శాతానికి దిగి వచ్చింది.

చ‌ద‌వండి: ఏ సహకార బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కొత్త ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు  : డిసెంబర్ 29
ఎవరు    : ద్విచక్ర వాహన దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Dec 2021 05:24PM

Photo Stories