Skip to main content

యూడీఐఎస్‌ఈ ప్లస్‌ 2019–20 నివేదిక విడుదల

భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ ప్లస్‌) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ జూలై 1న న్యూఢిల్లీలో విడుదల చేశారు.
Current Affairs 2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్‌ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్‌ఈ పర్యవేక్షిస్తోంది.

నివేదికలోని ముఖ్యాంశాలు...
  • 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది.
  • పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌) సైతం మెరుగుపడింది.
  • విద్యుత్‌ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్‌ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగింది.
  • 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారు. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు.
  • 2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రా«థమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారు.
  • 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది.
  • 2019–20 సంవత్సరంలో దేశంలో 90 శాతం కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్‌వాష్‌ సౌకర్యాన్ని కల్పించారు. 97 శాతం బడుల్లో బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయి.
  • 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ.
  • 2019–20లో సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ ప్లస్‌) 2019–20 నివేదిక విడుదల
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధిన వివరాలను వెల్లడించేందుకు...
Published date : 02 Jul 2021 06:38PM

Photo Stories