Skip to main content

యస్ బ్యాంక్ పునర్నిర్మాణ స్కీమ్ రూపకల్పన

సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది.
Current Affairsఇందుకోసం యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ 2020, ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు.

అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్
యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ ప్రశాంత్ కుమార్ మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రశాంత్ వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు
Published date : 07 Mar 2020 05:53PM

Photo Stories