యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త ఎవరు?
Sakshi Education
యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) కన్నుమూశారు.
జూన్ 23న స్పెయిన్‌లో బార్సిలోనా నగర సమీపంలోని జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పన్నుల ఎగవేత కేసులో మెకఫీను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్ నేషనల్ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరం రుజువైతే మెకఫీకి 30 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు. అమెరికా పౌరుడైన జాన్ మెకఫీ క్రిప్టోకరెన్సీ ప్రమోటర్‌గానూ వ్యవహరించారు.
Published date : 25 Jun 2021 06:24PM