Skip to main content

వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు ఆమోదం

ఎస్‌ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును సెప్టెంబర్ 17న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.
Current Affairs
వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్ కమాడిటీస్(అమెండ్‌మెంట్)’ సెప్టెంబర్ 15న లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు.

మూడు బిల్లులు-వివరాలు
1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు.

2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు.

3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.

చదవండి: వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మంత్రి?

క్విక్ రివ్యూ :

ఏమిటి : వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్17
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : రైతుల ఆదాయం పెంచేందుకు
Published date : 18 Sep 2020 05:18PM

Photo Stories