వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్ స్థానం?
Sakshi Education
కొత్తగా ఆవిష్కరించిన ఆరోగ్య సూచీ ప్రమాణాలను బట్టి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 11 ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది.
ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జనవరి 28న విడుదల చేసిన ‘‘ఆసియా-పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇండెక్స్‌లో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్ తర్వాత తైవాన్ రెండో స్థానంలో, జపాన్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి.
11 ఆసియా పసిఫిక్ దేశాలు...
ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, న్యూజీలాండ్ దేశాలలో వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నాయా? అనే విషయంపై అధ్యయనం చేసి ‘ఆసియా-పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్’ను రూపొందించారు. 27 విభిన్న ప్రమాణాల ఆధారంగా నాలుగు కేటగిరీల్లో వ్యక్తిగత ఆరోగ్య సూచీని కొలుస్తున్నారు. ఆరోగ్య సమాచారం విషయంలో భారత్ 41వ స్కోరుతో పదో స్థానం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్ 10వ స్థానం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆసియా-పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్
ఎక్కడ : 11 ఆసియా పసిఫిక్ దేశాల్లో

Published date : 01 Feb 2021 06:16PM