Skip to main content

వృద్ధి వేగంలో పదేళ్లు భారత్‌దే పైచేయి: ఆక్స్‌ఫర్డ్

న్యూఢిల్లీ: వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ విభాగం రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రూపొందిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
  • 2019-28 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటితో చూస్తే అధికం.
  • భారత్ తరువాతి స్థానాల్లో ఫిలిప్పైన్స్ (5.3 శాతం), ఇండోనేషియా (5.1 శాతం) ఉంటాయి.చైనా సగటు వృద్ధి కూడా 5.1 శాతంగా ఉంటుంది.
  • వర్థమాన దేశాల తమ వృద్ధిని పటిష్టం చేసుకోడానికి నూతన ఆవిష్కరణలు, పరిశోధనా, అభివృద్ధి, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది దేశీయంగా మూలధన సృష్టికి కూడా దోహదపడుతుంది.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇటీవలి అంచనాల ప్రకారం- భారత్ వృద్ధిరేటు 2019లో 7.5 శాతం. 2020లో 7.7 శాతం. చైనా వృద్ధి ఇదే కాలంలో 6.2 శాతంగా ఉండనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయి..
ఎందుకు : భారత్ వృద్ధి రేటు
Published date : 21 Feb 2019 06:05PM

Photo Stories