Skip to main content

వరంగల్‌లో మహీంద్రా, సైయంట్ సెంటర్లు ప్రారంభం

వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 7న ప్రారంభించారు.
Current Affairsఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ... ‘వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం’ అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : మడికొండలోని ఐటీ సెజ్, వరంగల్ అర్బన్ జిల్లా

మాదిరి ప్రశ్నలు
Published date : 08 Jan 2020 05:27PM

Photo Stories