Skip to main content

వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా కిప్‌చోగె, దలిలా

మారథాన్ వీరుడు ఎల్యుద్ కిప్‌చోగె(ఇథియోపియా), హర్డిల్స్ రారాణి దలిలా మహ్మద్(అమెరికా) ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2019’గా ఎంపికయ్యారు.
Current Affairsఒలింపిక్ చాంపియన్ కిప్‌చోగె 2019, అక్టోబర్‌లో వియన్నా వేదికగా జరిగిన 42.195(26.219 మైళ్లు) కిలోమీటర్ల మారథాన్ రేసును గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో పూర్తిచేసిన సంగతి తెలిసిందే. తద్వరా మారథాన్ చరిత్రలో ఓ రేసును రెండు గంటల్లోపే చేరుకొన్న తొలి అథ్లెట్‌గా చరిత్ర కెక్కాడు. దీంతో అతను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు.

మరోవైపు మహిళల 400మీ హర్డిల్స్‌లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న దలిలా మహ్మద్ 2019, జూలైలో అయోవా వేదికగా జరిగిన పోటీల్లో 52.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత దోహాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 52.16 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మరోసారి వరల్డ్ రికార్డు సృష్టించింది. దీంతో ఆమె ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2019గా ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎల్యుద్ కిప్‌చోగె(ఇథియోపియా), దలిలా మహ్మద్(అమెరికా)
Published date : 25 Nov 2019 05:49PM

Photo Stories