Skip to main content

విద్యాలయాలకు ఫిట్ ఇండియా గ్రేడింగ్

దేశవ్యాప్తంగా విద్యాలయాలకు ‘ఫిట్ ఇండియా స్కూల్’గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Current Affairsనవంబర్ 24న ఆయన ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ఫిట్ ఇండియా స్కూల్’ ర్యాంకుల్లో మూడు రకాలుగా విభజించినట్లు చెప్పారు. ఫిట్ ఇండియా స్కూల్, ఫిట్ ఇండియా స్కూల్(త్రీ స్టార్), ఫిట్ ఇండియా స్కూల్(ఫైవ్ స్టార్) ఉంటాయన్నారు. ప్రతి స్కూల్ తన విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం అమలు చేస్తున్న ఫిట్నెస్ కార్యక్రమాలు, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా వీటిని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణ కోసం విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’ సంస్థ స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విద్యాలయాలకు ఫిట్ ఇండియా గ్రేడింగ్
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 25 Nov 2019 05:53PM

Photo Stories