విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
Sakshi Education
భారత్ విదేశీ మారక నిల్వలు సెప్టెంబరు 6తో ముగిసిన వారంలో 100 కోట్ల డాలర్లు పెరిగి 42,960.8 కోట్ల డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెప్టెంబర్ 13న వెల్లడించింది.
బంగారం నిల్వలు 19.9 కోట్ల డాలర్లు తగ్గి 2,735 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ నిల్వలు 143.4 కోట్ల డాలర్ల వద్ధ యథాతథంగా ఉన్నాయంది. అదే విధంగా ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 20 లక్షల డాలర్లు పెరిగి 361.9 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 14 Sep 2019 05:34PM