వెర్‌స్టాపెన్‌కు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్
Sakshi Education
రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్‌కు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ లభించింది.
బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో నవంబర్ 17న జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసులో పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్ అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 14.678 సెకన్లలో రేసును ముగించి సీజన్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెకన్ల తేడాతో రేసును ముగించిన టొరో రోసో (ఎస్టీఆర్) డ్రైవర్ పియర్ గ్యాస్లీ రెండో స్థానంలో నిలువగా... చివరి నుంచి మొదలు పెట్టిన మెక్‌లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్ మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే 387 పాయింట్లతో మెర్సిడెస్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం చేసుకోగా... సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1న జరుగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : సావోపాలో, బ్రెజిల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : సావోపాలో, బ్రెజిల్
Published date : 19 Nov 2019 04:55PM