Skip to main content

వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
Current Affairs
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 12న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్న ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదును ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.4,687 కోట్లు వ్యయం కానుంది.

వైఎస్సార్‌ చేయూత ప్రారంభం సందర్భంగా వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులు, కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని, వైఎస్సార్‌ చేయూత ద్వారా నాలుగేళ్లూ కచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యలయం, తాడేపల్లి
ఎందుకు :రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు
Published date : 13 Aug 2020 05:31PM

Photo Stories