వైద్య సిబ్బందికి పీఎం గరీబ్ కల్యాణ్ బీమా పథకం
Sakshi Education
కోవిడ్-19(కరోనా వైరస్) బాధితులకు చికిత్స అందిస్తూ, లేదా అదే వైరస్ బారినపడి మృతిచెందే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ ద్వారా ఈ బీమాను అందించనున్నట్లు తెలిపింది. 2020, మార్చి 30 నుంచి 90 రోజులపాటు ఇది అమల్లో ఉంటుందని ఏప్రిల్ 7న పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, విశ్రాంత సిబ్బంది, వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు అందించే అవుట్‌సోర్స్, దినసరి సిబ్బందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకంలో చేరేందుకు వీరెవరూ ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్-19(కరోనా వైరస్) బాధితులకు చికిత్స అందిస్తూ, లేదా అదే వైరస్ బారినపడి మృతిచెందే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించేందుకు

Published date : 08 Apr 2020 05:54PM