Skip to main content

వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం

ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Current Affairs
భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అక్టోబర్ 18న తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు.

వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్-19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో భారత్ బయోటెక్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

పుట్టగొడుగులతో రోగనిరోధక శక్తి ఔషధం
పుట్టగొడుగులతో తయారుచేసిన రోగనిరోధక శక్తి పెంపు ఔషధం త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది. కరోనా నేపథ్యంలో ఈ ఔషధాన్ని తీసుకొస్తున్నట్లు క్లోన్‌డీల్స్, ఆంబ్రోసియా ఫుడ్ ఫామ్ సంస్థలు తెలిపాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం
Published date : 20 Oct 2020 05:41PM

Photo Stories