Skip to main content

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంపీ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పదవికి తీరథ్‌ సింగ్‌ రావత్‌ జూలై 2న రాజీనామా చేశారు. డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన రావత్‌ గవర్నర్‌ బేబీరాణి మౌర్యకు తన రాజీనామా లేఖ సమర్పించారు.
Current Affairsబీజేపీ ఎంపీ అయిన రావత్‌ సీఎంగా కొనసాగాలంటే ఆరునెలల్లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. కోవిడ్‌ సంక్షోభం, 2022 ఏడాదిలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం వెంటనే ఎన్నికలు పెట్టే ఆలోచనలో ఈసీ లేదనే వార్తల నేపథ్యంలో... రావత్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీరథ్‌సింగ్‌ రావత్‌ (56) 2021, మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013 నుంచి 2015 వరకూ ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జూలై 2
ఎవరు : తీరథ్‌ సింగ్‌ రావత్‌
ఎందుకు : రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కానీ నేపథ్యంలో...
Published date : 03 Jul 2021 12:03PM

Photo Stories