ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి పథకానికి ఎంపికైన జిల్లా?
Sakshi Education
ఉద్యాన పంటల సాగుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 53 క్లస్టర్లను గుర్తించింది.
వీటి సమగ్ర, మార్కెట్ ఆధారిత అభివృద్ధికి క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(సీడీపీ)ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 10 క్లస్టర్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా (అరటి సాగు), తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా (మామిడి తోటల పెంపకం) ఉన్నాయి. మే 31న ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ, తెలంగాణ నుంచి ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి పథకానికి ఎంపికైన జిల్లాలు?
ఎప్పుడు : మే 31
ఎవరు : అనంతపురం జిల్లా (అరటి సాగు), మహబూబ్‌నగర్ జిల్లా (మామిడి తోటల పెంపకం)
ఎందుకు :ఉద్యాన పంటల సాగు కోసం

Published date : 02 Jun 2021 06:25PM