Skip to main content

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

16వ లోక్‌సభ చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31న ఉభయసభల్ని(రాజ్యసభ, లోక్‌సభ) ఉద్దేశించి ప్రసంగించారు.
నవభారత నిర్మాణానికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందని, దానిని సాకారం చేయడానికి అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని కొనియాడారు. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. అలాగే రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను రాష్ట్రపతి ప్రస్తావించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
Published date : 01 Feb 2019 05:04PM

Photo Stories