Daily Current Affairs in Telugu: 2022, జూన్ 18th కరెంట్ అఫైర్స్
Sakshi Education
Current Affairs in Telugu June 18th 2022(డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Justice RP Desai Nominated As Chairperson Of Press Council Of India: పీసీఐ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఆర్‌పీ దేశాయ్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా చైర్ పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్(72) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ జూన్ 17(శుక్రవారం) గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆమె ఎంపికపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పీసీఐ సభ్యుడు ప్రకాశ్ దుబేలతో కూడిన కమిటీ ఆమోదముద్ర వేసింది. 2011–2014 మధ్య ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు.
Strong, united ASEAN: బలమైన, ఐక్య ఆసియాన్
- అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. జూన్ 16(గురువారం) ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు.
- వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.
- Download Current Affairs PDFs: Click Here
- యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 18 Jun 2022 07:08PM